తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే అనసూయ.. తాజాగా మరో సంచలన ట్వీట్ చేసింది. ఆ వివరాలు..
వివాదాలను, అనసూయను విడదీసి చూడలేము. బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది అనసూయ. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. సోషల్ మీడియాను మాత్రం వదలదు. నిత్యం ఏదో పోస్టింగ్ చేస్తూ.. ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమానులకు ట్విట్టర్ వేదికగా సాగే వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో వీరి మధ్య వివాదం ప్రారంభం అయ్యింది. అది కాస్త.. అలా పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత లైగర్ సినిమా సమయంలో అనసూయ కర్మ ఫలితం అంటూ ట్వీట్ చేయడం.. రౌడీ ఫ్యాన్స్ ఆంటీ అంటూ కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే వరకు సాగింది. ఇక తాజాగా మరోసారి విజయ్‌దేవరకొండను ఉద్దేశిస్తూ.. ఇన్‌డైరెక్ట్‌గా అనసూయ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
తాజాగా అనసూయ.. ‘‘ ఇప్పుడే ఒకటి చూశాను. ది(The) నా.. బాబోయ్.. ఏం చేస్తాం.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ కాగా.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కౌంటర్స్ స్టార్ట్ చేశారు. ఇంతకు అనసూయ ది అని పోస్ట్ చేయడం ఏంటి.. దానికి విజయ్ దేవరకొండకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే కొంత సమయం వెనక్కి వెళ్లాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ సినిమా రిలీజ్ నీ గ్రాండ్ గా ప్లాన్ చేసిన నేపథ్యంలో ప్రమోషన్స్‌ని కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేశారు చిత్ర బృందం.
ఖుషి సినిమా మొదటి సాంగ్ మే 9 తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగులో నా రోజా నువ్వే అనే పాట రిలీజ్ చేస్తున్నామని అదే పాటను తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది విజయ్ దేవరకొండ’ అని పేర్కొనడం కాస్త.. అనసూయ భరద్వాజ్ కంట్లో పడినట్లు ఉంది. ఇక తాజాగా అనసూయ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. నిజానికి ఇంగ్లీష్ గ్రామర్ పరంగా.. ఈ ‘ది’ అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు మాత్రమే వాడుతూ ఉంటారు. అంటే విజయ్ దేవరకొండ యూనిక్ అని అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు ఈ ‘ది’ పదాన్ని యాడ్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.
కానీ కొందరు మాత్రం ఈ విషయంలో విజయ్‌దేవరకొండ మీద విమర్శలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అతి చేస్తున్నాడని.. అమితాబచ్చన్, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్లే ఎప్పుడూ ఇలాంటి పదాలు వాడుకోలేదు.. కానీ ఇతడు మాత్రం నాలుగైదు సినిమాలకే ఇలాంటి కానీ చేసిన నాలుగు సినిమాలకే ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ భరద్వాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడే ఒకటి చూశాను ‘ది’నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. ఇక్కడ ఆమె డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించకపోయినా ‘ది’ అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె ఉద్దేశం ఏంటో స్పష్టం అయ్యింది. ఇక దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023
#NaRojaaNuvve Song From #Kushi Out On MAY 9th. pic.twitter.com/V61BXGjxhB
— TeluguMoviesClub (@TFIMovieUpdates) May 4, 2023