టీవీ చూసేవాళ్లకు, రెగ్యులర్ సోషల్ మీడియా వాళ్లకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో విషయంలో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.. తాజాగా కాస్త రిలీఫ్ అయినట్లు కనిపించింది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి ఆమెతో పాటు పలువురు సెలబ్రిటీల ఫొటోలని అసభ్యకరంగా ఉపయోగిస్తున్నాడని, ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడని అనసూయ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే వారు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది జరిగి రెండు వారాలు అవుతోంది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. కామెంట్స్ చేసే విషయంలో కాస్త భయం ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే విషయమై మాట్లాడిన అనసూయయ.. పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇన్ స్టా, ట్విట్టర్ లో అనసూయ యాక్టివ్ గా ఉందంటే చాలు ఏదో ఓ విషయం హాట్ టాపిక్ కావడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఆమె కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ నెటిజన్లతో ఆమె ముచ్చటించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఇందులో భాగంగానే చాలా ప్రశ్నలకు తనదైన ఆన్సర్స్ ఇచ్చింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కదా అని ఓ నెటిజన్ అడగ్గా.. తాను డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేయనని, జనాలను ఎంటర్ టైన్ చేసేందుకు నటిస్తాను అని చెప్పింది. కొన్నిసార్లు పాత్ర నచ్చకపోయినా సరే.. ఫేవరెట్ హీరో ఉన్నారనే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంటానని అనసూయ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి గురించి ఓ నెటిజన్ అడిగాడు.
‘అరెస్టులు మొదలయ్యాయి కదండి.. ఇది కొందరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా! విచారణ జరిపి అరెస్టు చేస్తున్నారు. మెల్లగా జరుగుతుందో. కానీ ప్రొసెస్ మాత్రం జరుగుతోంది. మన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. బయట ఇలా చేసే వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఎదుటి వాళ్లను కించపరచడం, అగౌరవపరచడం తప్పు. ఇది చట్టరీత్యా నేరం అనేది కచ్చితంగా అమల్లోకి రావాలి. తీసుకురావాలి. ఇనాళ్లు చాలా ఓపికతో నచ్చజెప్పాను. ఇప్పుడు ఇక యాక్షనే’ అని అనసూయ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే ‘జబర్దస్త్’ నుంచి బయటకొచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం రంగమార్తాండ, హరిహర వీరమల్లు, పుష్ప 2, మైఖేల్ తదితర సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ భారీ చిత్రంలో కీలకపాత్రలో నటించనుందని తెలుస్తోంది.