అనసూయ భరధ్వాజ్.. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె కెరీర్ మొదలైంది . ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ సంస్థలో ప్రసారమౌతున్న జబర్థస్త్ షోకి యాంకర్‌గా అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
నటి, యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ సంస్థలో ప్రసారమౌతున్న జబర్థస్త్ షోకి యాంకర్‌గా అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. వెండితెరపై కూడా అడుగుపెట్టింది. యాంకర్ కాక ముందు నాగ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. యాంకరింగ్ చేస్తున్న సమయంలోనే ఆమెకు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, రంగస్థలం వంటి సినిమాలతో మంచి మార్కులు పడ్డాయి. అలాగే కొన్ని లేడీ ఓరియంట్ సినిమాలు చేసింది. అయితే పుష్పలో చేసిన ఆమె నెగిటివ్ క్యారెక్టర్.. ఆమెలోని నట విశ్వరూపాన్ని చూపించింది. ఆ తర్వాత యాంకరింగ్ నుండి తప్పుకున్న అనసూయ.. పూర్తిగా ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెంచింది.
తనకు నచ్చిందీ చేస్తూ.. ఆంటీ అనే పదానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేసింది. విజయ్ దేవర కొండతో వివాదం ఆమె అందరి నోళల్లో నానేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ స్టార్ యాంకరమ్మ బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దర్శకుడు, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సముద్ర ఖని.. ఇటీవల కాలంలో తెలుగులో పలు సినిమాలు చేసిన సంగతి విదితమే. అయితే ఆయన తాజాగా విమానం అనే సినిమాలో నటిస్తున్నారు. అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ విడుదల చేయగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో నటి అనసూయ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఆమెకు సంబంధించిన ఓ పాటను తాజాగా రిలీజ్ చేయగా.. అనసూయను చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు నెటిజన్లు.
రాహుల్ రామకృష్ణ, అనసూయపై రూపొందించిన ఈ పాటలో ఆమె చాలా బోల్డ్ గా కనిపిస్తున్నారు. సుమారు వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ‘సుమతి… నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొణికె వనిత…’ అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు చరణ్ అర్జునే రాసి పాడారు కూడా. అందాలన్నీ ఒలబోస్తూ కనిపిస్తుంది. ఆమె కోసం పరితపిస్తున్న వాడిగా రామకృష్ణ కనిపిస్తున్నారు. ఆమె సుమతి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన తెలుగు, తమిళం భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.