సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు దారి తీస్తుంది. వారి సినిమా హిట్ అయినా, ఫట్ అయినా, కలెక్షన్లు వచ్చినా, రాకపోయినా చర్చలు జరగాల్సిందే. అక్కడితో ఆగితే పర్లేదు.. వారి వ్యక్తిగత జీవితాలపై కూడా చర్చ, సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరగాల్సిందే. ఏ భామ ఎవరితో డేటింగ్ చేస్తోంది? ఎవరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు? ఎవరు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు? ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి లైగర్ భామ అనన్య పాండే- ఇషాన్ కట్టర్ పేర్లు చేరాయి. వాళ్లు వారి ప్రేమకు గుడ్ బై చెప్పుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి: MLA రోజాకూ భారీ షాక్.. భర్తపై అరెస్ట్ వారెంట్!
అనన్య పాండే- ఇషాన్ కట్టర్ ‘ఖాళీ పీలి’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా డేటింగ్, రిలేషన్ అంటూ గడిపేస్తున్నారు. కానీ, గత రెండ్రోజులుగా బాలీవుడ్ వర్గాల్లో వీళ్లిద్దరూ విడిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారి బ్రేకప్ కు కారణాలు ఏంటి? అసలు అది నిజమేనా? కేవలం గాసిప్ క్రియేట్ చేశారా? వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. పూరి- విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్ లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్య- ఇషాన్ కట్టర్ బ్రేకప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.