అనన్య నాగళ్లకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇంక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. తాను ఒక పిక్ అప్ లోడ్ చేసిందంటే.. తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడుఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా అనన్య కాసేపు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ్ వైరల్ అవుతోంది.
అనన్య నాగళ్ల.. మల్లేశం సినిమాలో పద్మలా తెలుగు ప్రేక్షకులను ఆక్టుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ సంపాదించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్లే బ్యాక్ సినిమాలో లీడ్ రోల్ లో కూడా తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా సమంత చేసిన శాకుంతలం సినిమాలో కూడా అనన్య మంచి క్రెడిట్ కొట్టేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఊపరిసలపనంత బిజీగా ఉందంట. సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ప్రేక్షకులను మాత్రం పలకరిస్తూనే ఉంటారు. అందులో అనన్య నాగళ్ల ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఆస్క్ మీ అంటూ ప్రేక్షకులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చింది.
సెలబ్రిటీలు ఆస్క్ మీ అంటే.. అభిమానులు ఆస్తులు తప్ప అన్నీ అడిగేస్తుంటారు. కెరీర్, పర్సనల్ ఇలా ఒకటేంటి వాళ్లకి ఏది అనిపిస్తే అది అడిగేస్తుంటారు. కొన్నిసార్లు చాలా సిల్లీ క్వశ్చన్స్ ని కూడా సంధిస్తుంటారు. అనన్యకు కూడా అలాంటి ప్రశ్నలు చాలానే వచ్చాయి. అయితే వాటిలో అందరూ హీరోయిన్స్ ని కామన్ అడిగే ఒక ప్రశ్నని కూడా అడిగారు. అదే బాయ్ ఫ్రెండ్ గురించి. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పచ్చు కదా.. అతని ఐడీ ఇవ్వచ్చు కదా అంటూ అడిగాడు. అందుకు అనన్య చాలా సింపుల్ గా ఒక వీడియో మెసేజ్ ని అతనికి సమాధానంగా చెప్పుకొచ్చింది. తన బాధను కూడా అందులో వ్యక్త పరిచింది.
“నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు భయ్యా. అందరూ ఉన్నారు అనే అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై కూడా చేయట్లేదు అనుకుంటా” అంటూ ఎవరూ ట్రై చేయట్లేదనే బాధను కూడా చెప్పుకొచ్చింది. ఇంకేముంది నన్ను ఎవరూ ట్రై చేయట్లేదు అని ఒక హీరోయిన్ అంటే ఇంకేమైనా ఉందా. ఆ మ్యాటర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంక చాలా మంది మీ వాట్సాప్ డీపీ, ఎక్కడ ఉన్నారు? నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇలా చాలానే ప్రశ్నలు అడిగారు. అన్నింటికి అనన్య నాగళ్ల ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పింది. త్వరలోనే చాలా మంచి ప్రాజెక్ట్స్ తో ముందుకు రానున్నట్లు వెల్లడించింది. కచ్చితంగా కంటెంట్ ఉన్న క్యారెక్టర్లు చేసినట్లు తెలిపింది.