సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా, పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ . మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతూ.. మహేష్ బాబు కెరీర్‌లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్‌లో మహేష్ అద్భుతంగా నటించాడు. బడాబాబులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొడితే.. సామాన్యుల నుంచి బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా వసూలు చేస్తున్నాయనే కోణంలో పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం ఈ మూవీ గురించి వ్యాఖ్యనించడం విశేషం. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈ మూవీ గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, కథనాలు పోస్ట్ చేయడంతో పాటు.. తాజాగా జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు తన రియాక్షన్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా ‘సర్కారు వారి పాట‘ మూవీపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనుపమ్ తరేజా షేర్ చేసుకున్న వీడియోను రీట్వీట్ చేస్తూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, జావా మెరూన్‌ల కాంబినేషన్ అన్‌బీటబుల్ అని అన్నారు. ఈ కాంబినేషన్‌ను చూడకుండా తాను ఎలా ఉండగలనన్నారు. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో ఉన్నానని.. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ఆడుతుందో తెలుసుకుని.. ఆ థియేటర్‌కి వెళ్లి చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022
ఇది కూడా చదవండి: Anchor Shyamala: మమ్మ మహేశా.. పాటకు యాంకర్ శ్యామల మాస్ డాన్స్.. వీడియో వైరల్!
ఇక ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్న జావా మోటార్‌సైకిల్ నిజానికి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బైక్. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ బైక్ ఇండియాకు వచ్చింది. ఇప్పుడు జావా మోటార్‌బైక్‌లు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి అనుబంధంగా ఉన్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: KGF-2, SVP: బాక్సాఫీస్ పై ‘సర్కారు వారి పాట, KGF-2’ల దండయాత్ర.. కలెక్షన్స్ వివరాలు!
‘సర్కారు వారి పాట’ మూవీ హిట్ తరువాత మహేష్ బాబు, రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు.హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ మూవీల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. ఇక సర్కారు వారి పాట గురించి ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Keerthy Suresh: మహేశ్ బాబుని కీర్తి సురేష్ బో*గాడు అనే డైలాగ్ వెనుక ఇంత జరిగిందా?