గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ హిట్. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడో ఓచోట మూవీని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ నుంచి అదే స్థాయిలో రెస్పాన్ వస్తూనే ఉంది. జపాన్, అమెరికా.. ఇలా ఎక్కడ స్క్రీనింగ్ చేసినా సరే ఫ్యాన్స్ రచ్చ చేస్తూనే ఉన్నారు. ఇక హాలీవుడ్ సెలబ్రిటీలైతే ‘ఆర్ఆర్ఆర్’ని ఆకాశానికెత్తేస్తున్నారు. రీసెంట్ గా ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ ఇదేనంటూ నెటిజన్స్ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్ల ఫస్ట్ టైం అవార్డు దక్కించుకున్న ఆసియన్ మూవీ సాంగ్ గా ‘నాటు నాటు’ రికార్డు సృష్టించింది. అయితే ఈ సాంగ్ వినగానే అందరికీ రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా గ్రేస్ తో వేసిన స్టెప్పులే గుర్తొస్తాయి. కొరియోగ్రఫీకి తోడు సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అయితే ఈ పాట నుంచి సినీ సెలబ్రిటీలతోపాటు మిగిలిన రంగాలకు చెందిన ప్రముఖులు బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, తన ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.
అందులో ఇద్దరు హాలీవుడ్ నటులు ఓ సాంగ్ కలిసికట్టుగా స్టెప్పులు వేస్తూ కనిపించారు. అక్కడ ఏ సాంగ్ ఉందనేది తెలియదు కానీ ఆ విజువల్ కు ‘నాటు నాటు’ ఆడియోని సెట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే ఆనంద్ మహీంద్రా కంటపడింది. దీంతో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజైనప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ‘నాటు నాటు’ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో మరోసారి వైరల్ గా మారింది. ‘నాటు నాటు మేనియా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వీడియోలోని ఈ రెండు పాత్రల్లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండకపోవచ్చు. అయినా పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్స్ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూడగానే మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5
— anand mahindra (@anandmahindra) January 13, 2023