సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ లు చాలా తక్కువ టైమ్ ఉంటాయి. మహా అయితే 5 లేదా 10 సంవత్సరాలు. కానీ కొంత మంది తారలు మాత్రమే లాంగ్ కెరీర్ ను సాగిస్తూ.. 20ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది హీరోయిన్స్ మాత్రం తమ పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు దూరం అవుతారు. అలా దూరం అయిన వారిలో అమృతారావు ఒకరు. ఈ అమ్మడు తన వైవాహిక జీవితం గురించి తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అమృతారావు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా బాలీవుడ్ హీరోయిన్ అయిన అమృతారావు అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించింది. తన యూట్యూట్ ఛానెల్ “కపుల్ ఆఫ్ థింగ్స్” ద్వార తన కుటుంబ కష్ట నష్టాల గురించి చెప్పుకొచ్చింది. అదీ కాక తన భర్తకు తనకు జరిగిన గొడవల గురించి సరదాగా వివరించింది.
అమృతారావు-ఆర్జే అన్మోల్ లది లవ్ మ్యారేజ్. కొన్ని రోజులు ప్రేమ ప్రయాణం తర్వత వీరు 2014లో పెళ్లితో ఒక్కటైయ్యారు. ఇక అమృతారావు తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ..” నేను అన్మోల్ సహజంగానే చాలా విషయాల్లో ఒకేలా ఆలోచిస్తాం. అదీ కాక మా మధ్య గొడలు, అభిప్రాయా భేదాల లాంటివి 10ఏళ్ల వరకు లేవు. ఇక ఎప్పుడైతే మా మధ్య మరోకరు అంటే నా కొడుకు వీర్ వచ్చాడో.. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి.
దాంతో మరో బిడ్డను కనాలంటే నాకు భయం వేస్తుంది. కొడుకు విషయంలో ప్రతీ నిర్ణయం నా భర్తే తీసుకోవాలను కుంటాడు. నేను చెప్పే సూచనలను అస్సలు పట్టించుకోడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడలు జరుగుతూ ఉంటాయి. అందరి ఇళ్లలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి అనుకుంటాను. ఇక నేను డేటింగ్ చేసే సమయంలో అతడు నాతో ఉంటాడా? వదిలేస్తాడా? అనుకునేదాన్ని.
కానీ అతడు అలా చేయలేదు. పైగా మేం ఇద్దరం శారీరకంగా దగ్గర అయ్యాం, దాంతో నా ప్రియుడే నాకు భర్తగా లభించాడు” అంటూ తన వైవాహిక జీవితంలో జరిగిన విశేషాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పం చుకుంది. మరి అమృతారావు పం చుకున్న తన జీవిత విశేషాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.