సినిమాపై, సినిమా వాళ్లపై ఆధారపడి బతికే వాళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో పపరజీలు కూడా ఒకరు. వీళ్లు కేవలం సినిమా వాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి, అమ్మి సొమ్ము చేసుకుని బతుకుతూ ఉంటారు. అందుకే సినిమా సెలెబ్రిటీలు ఎక్కడికైనా వెళితే వారిని ఫాలో అయి మరీ ఫొటోలు తీస్తూ ఉంటారు. ఎయిర్‌పోర్టులు, ఈవెంట్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు ఇలా అన్నీ చోట్లా వీళ్లు కాపు కాస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా వాళ్లను ఫొటోలు తీస్తూ ఉంటారు. అయితే, పపరజీల కారణంగా తమ పర్సనల్ లైఫ్ మీడియాలోకి ఎక్కుతోందని కొంతమంది సెలెబ్రిటీలు భావిస్తుంటారు. అందుకే, కొంతమంది పపరజీలతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
మరికొంతమంది పపరజీలను చూడగానే అక్కడినుంచి జారుకుంటూ ఉంటారు. తాజాగా, పపరజీలకు భయపడి ఓ హీరో, ప్రముఖ నటి కోటు అడ్డం పెట్టుకుని మరీ పరుగులు పెట్టారు. ఆ హీరో, ప్రముఖ నటి ఎవరో కాదు. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, నటి అమ్రితా అరోరాలు. నిన్న అమ్రితా అరోరా 45వ పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకను ఆమె ఫ్రెండ్ కరీనా కపూర్ ఖాన్ నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. అర్జున్ కపూర్, ఫర్హాన్ అక్తర్, మలైకా అరోరా, ఏపీ దిల్హాన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అయిపోయిన తర్వాత అమ్రిత, ఫర్హాన్ ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. బయట పపరజీలు ఉండటం చూసి ఫర్హాన్ తన కోటును విప్పాడు. దాన్ని అడ్డుగా పెట్టుకున్నాడు. అందులోనే అమ్రిత కూడా చేరింది. ఇద్దరూ జంటగా కోటును అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటు అడ్డం పెట్టుకుని రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.