సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొంతమంది నెటిజన్లు పని గట్టుకుని మరీ సినిమా వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు. సినిమా వాళ్లను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు.
ఒకప్పుడు అభిమానులు తమ కిష్టమైన సినిమా నటులతో ఇంటరాక్ట్ అవ్వటానికి లెటర్‌లు రాసేవారు. తాము చెప్పాలనుకున్నదంతా ఆ లెటర్‌లో రాసి పంపేవారు. కొన్ని కొన్ని సార్లు అభిమానుల లెటర్లకు నటుల దగ్గరినుంచి సమాధానం వచ్చేది. తర్వాతి కాలంలో లెటర్స్ తగ్గిపోయాయి. ఆ స్థానంలో మెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ మెయిల్స్ కూడా పాతబడిపోయాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన ఈ సమయంలో.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల హవా బాగా నడుస్తోంది. సినిమా వాళ్లు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.
తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సార్లు కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. నటీ,నటుల వ్యక్తిగత విషయాలపై పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా, ప్రముఖ నటి అమ్ము అభిరామిని ఓ నెటిజన్ బరువు గురించి ఓ ప్రశ్న అడిగాడు. దీనికి ఆమె దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమ్ము అభిరామి కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పెట్టారు.
ఆ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘ ఈ మధ్య చాలా బరువు పెరిగినట్లు ఉన్నారు’’ అని ప్రశ్నించాడు. దీనిపై అభిరామి సమాధానం ఇస్తూ.. ‘‘ అయితే ఏంటి?’’ అని అన్నారు. దీంతో ఆ నెటిజన్ ఈగో బాగా దెబ్బతింది. ‘‘ ఏం లేదు.. ఇలానే బరువు పెంచుకుంటూ పో’’ అని వ్యంగ్యంగా అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మరి, నెటిజన్ తిక్క ప్రశ్నకు అమ్ము అభిరామి ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.