Amma Rajasekhar: సిని ఇండస్ట్రీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజమే. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణం అయ్యాయి. ఓ స్టార్ హీరోపై కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అమ్మ రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సుపరిచితమే.
చాలా గ్యాప్ తర్వాత మరోసారి అమ్మ రాజశేఖర్ మెగాఫోన్ పట్టి.. హై ఫైవ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హై ఫైవ్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో నితిన్ పై ఫైర్ అయ్యాడు రాజశేఖర్. ఆయన మాట్లాడుతూ.. నితిన్ తనకు మంచి మిత్రుడని, టక్కరి సినిమా నుంచి మా మధ్య మంచి స్నేహం ఉందని చెప్పిన రాజశేఖర్.. ఇప్పుడు అవన్ని మర్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
నితిన్ కి డ్యాన్స్ కూడా రాదని, నేనే వాడికి నేర్పించానని ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదన్నారు. నా సొంత సినిమాకి పిలిచినా ఇంట్లో ఉండి కూడా రాలేనన్నాడు. అలాగే హీరోలందరికి చెబుతున్నాను.. సహాయం చేసిన వారిని మర్చిపోకూడదని, వస్తే వస్తా అని లేకపోతే లేదని చెప్పాలి.. కానీ ఇలా వస్తా అని రాకపోవడం ఏంటని, ఒక గురువుగా ఇది నన్ను అవమానించడమే అని అన్నారు.
ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ నితిన్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. హీరో నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రమోషన్స్ లో బీజీగా ఉన్నాడు. మరి తాను ఎందుకు ఈ ఈవెంట్ కాలేదో తెలియరాలేదు. ఇక అమ్మరాజశేఖర్ కామెంట్స్ పై నితిన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. దీని పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.