బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేశంలో దాదాపు అందరికీ తెలిసిన సూపర్ స్టార్. 80 ఏళ్ల వయసులోనూ స్టిల్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగులో అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఈయన.. తాజాగా హైదరాబాద్ లో గాయపడ్డారని వార్తలొచ్చాయి. దీంతో ఈ విషయం ఉదయం నుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? అమితాబ్ కు ఎలా ఉందని ప్రతి ఒక్కరూ కంగారుపడుతున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేశంలో దాదాపు అందరికీ తెలిసిన సూపర్ స్టార్. 80 ఏళ్ల వయసులోనూ స్టిల్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటున్నారు. కానీ అమితాబ్, టెక్నాలజీ పెద్దగా లేని ఆ సమయంలోనే తన సినిమాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగులో అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఈయన.. తాజాగా హైదరాబాద్ లో గాయపడ్డారని వార్తలొచ్చాయి. దీంతో ఈ విషయం ఉదయం నుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? అమితాబ్ కు ఎలా ఉందని ప్రతి ఒక్కరూ కంగారుపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటులకు బయటకు అందంగా, అద్భుతంగా కనిపిస్తారు కానీ సినిమాల కోసం చాలా కష్టపడుతుంటారు. రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్స్ కు అటెండ్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు గాయాల పాలవుతుంటారు. అలా తాజాగా ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో భాగంగా అమితాబ్ కు గాయాలయ్యాయని కథనాలు వైరల్ అయ్యాయి. షూటింగ్ లో పక్కటెముకల దగ్గర గాయం కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారని.. చికిత్స తర్వాత అమితాబ్ ముంబయి వెళ్లిపోయారని.. మినిమమ్ రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇదిలా ఉండగా హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో తీస్తున్న ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ హైదరాబాద్ లో యమ స్పీడుగా జరుగుతోంది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అలా తాజాగా ఓ సీన్ లో భాగంగానే అమితాబ్ గాయపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో తాజాగా సినిమా ప్రాజెక్ట్ కే ప్రొడ్యూసర్ అశ్వినీదత్ స్పందించి.. అమితాబ్ బచ్చన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన మూడు రోజుల క్రితమే షూటింగ్ ముగించుకొని ముంబై వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారని సమాచారం. మరి అమితాబ్ ఆరోగ్యం విషయంలో అసలు విషయం ఏంటనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అమితాబ్ గురించి ప్రొడ్యూసర్ స్పందించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోయే ఈ మూవీకి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
“In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home,” posts Amitabh Bachchan.
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL
— ANI (@ANI) March 6, 2023