జాతీయ స్థాయిలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అమితాబచ్చన్. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే.. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అమితాబ్ గత కొంత కాలంగా బుల్లితెరపై పలు షోలకు హూస్త్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హూస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ దేశంలోనే బిగ్గెస్ట్ షో గా నిలిచింది. మంగళవారం అమితాబ్ తన 80వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు సినీ పరిశ్రమకు చెందినవారు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
అమితాబచ్చన్ తాను హూస్ట్ చేస్తున్న కౌన్ బనేగ కరోడ్ పతి షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబచ్చన్ షో నిర్వహిన్న సమయంలో ఒక్కసారే సైరన్ మోగింది. దీంతో అమితాబ్ అప్పుడే షో ముగిసిపోయిందా అంటూ అశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతలోనే బిగ్ బీ హిట్ సాంగ్ పాడుకుంటూ ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ స్టేజ్ పైకి వచ్చి తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు. ఒక్కసారే స్టేజ్ పై తనయుడిని చూసి బిగ్ బీ కంట కన్నీరు వచ్చింది. ఇదంతా అక్కడ ఉన్న ప్రేక్షకులు చూసి వారి కంట కూడా కన్నీరు వచ్చింది.
అమితా బచ్చన్ 80 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను సంతోష పెట్టడానికి ఈ షోకి వచ్చినట్లు చెప్పారు అభిషేక్ బచ్చన్. ఈ సందర్భంగా తండ్రిని హాట్ సీట్ పై కూర్చొబెట్టి తాను హూస్ట్ సీట్ పై కూర్చొని కొన్ని ప్రశ్నలు అడిగారు అబిషేక్ బచ్చన్. ఈ సందర్భంగా ఆయన లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ఫోటోలు చూపించి వాటి గురించి ప్రేక్షకులకు వివరించారు. ఈ సందర్భంగా అమితా బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కూడా వచ్చారు.
దీనికి సంబంధించిన ఒక వీడియో అభిషెక్ బచ్చన్ షేర్ చేశారు. ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని.. అంతా సీక్రెట్ గా వర్క్ ఫినిష్ చేశామని అన్నాడు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన కేబీసీ షోలో ఆయన 80 వ పుట్టిన రోజు చేయాలనే ఉద్దేశంతో తన కుటుంబం ప్లాన్ చేశామని అన్నారు. తన తండ్రికి ఈ షోలో పుట్టిన రోజు వేడుక చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నాకు ఎంతగానో సహకరించిన కేబీసీ టీమ్ కి నా కృతజ్ఞతలు అంటూ ఇన్ స్ట్రాలో రాసుకొచ్చారు అభిషేక్ బచ్చన్.