ఈమెని చూస్తే మనకు తెలియకుండానే వావ్ అనేస్తాం. ఎందుకంటే అంత బాగుంటుంది. ఒక్క పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమెని తన ఫ్యాన్స్ అందరూ ముద్దుగు యాపిల్ బ్యూటీ అని పిలుస్తారు. కొందరు చీర కడితే బాగుంటారు. మరికొందరు మోడ్రన్ డ్రస్ లో బాగుంటారు. ఇంకొందరు డ్యాన్స్ చేస్తే బాగుంటారు. మరికొంతమంది డ్యాన్స్ చేస్తే బాగుంటారు. పైన చెప్పిన వాటిలో ఏం తీసుకున్నా సరే ఆమె సూపర్ గా ఉంటుంది. కన్నడలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ ఒకే ఒక్క పాట, అందులోని తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆలోవర్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ట్రెండింగ్ లోకి కూడా వెళ్లిపోయింది. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి, ఇప్పుడు హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్. రీసెంట్ గానే కల్యాణ్ రామ్ ‘అమిగోస్’లో ఈమెనే కథానాయికగా చేసింది. ఇదే ఈమెకు తెలుగులో తొలి చిత్రం. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఈ మూవీ తడబడింది కానీ ఆషికా మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ అనే పాటకు ఈమె కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి.. ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టిందనే చెప్పాలి. స్వతహాగా మంచి డ్యాన్సర్ కూడా కావడం ఈమెకు చాలా ప్లస్ పాయింట్. ఇదే పాటలో సింపుల్ గా కనిపించిన స్టెప్స్ కూడా తన గ్రేస్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.
ఆషికా.. 2016లో వచ్చిన కన్నడ మూవీ ‘క్రేజీబాయ్’తో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత మాస్ లీడర్, కోటిగబ్బా 3, మదగజ, జేమ్స్, గరుడ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది చివర్లో ‘పట్టత్తు అరసన్’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టిన ఈమె.. కల్యాణ్ రామ్ ‘అమిగోస్’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. తెలుగులోనూ మరికొన్ని ప్రాజెక్టుల్లో ఆషికాను తీసుకోవాలని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏదేమైనా సరే ఒకే ఒక్క పాటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి./p>