పూరీ – లావణ్య ల విడాకులు.. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న వార్త. పూరీ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో సహజీవనం చేస్తున్నాడని, దీంతోనే తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన చిత్రం చోర్ బజార్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పూరీ జగన్నాథ్ గురుంచి ఊహించని రీతిలో పెదవి విరిచారు. కొడుకు మూవీ ప్రీరిలీజ్ జరుగుతుంటే అతను ముంబైలో ఉన్నాడని, ఆకాశ్ ను పట్టించుకోవా అంటూ మాట్లాడాడు. ఇక పూరీ భార్య లావణ్యపై ప్రశంసలు కురిపిస్తూ దేవత లాంటి తల్లికి అన్యాయం చేయోద్దంటూ కూడా పూరీ జగన్నాథ్ కు బండ్ల గణేష్ సూచించాడు. ఇక బండ్ల గణేష్ స్పీచ్ ఇటీవల సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: Allu Arjun: ‘ఇండియా టుడే కవర్ పేజీ’పై పుష్పరాజ్ స్వాగ్..! నీయవ్వ తగ్గేదే..లే!
దీంతో అప్పటి నుంచి నిజంగానే పూరీ జగన్నాథ్ తన భార్యను కాదని ఛార్మీతో సహజీనం చేస్తున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక నిజంగానే పూరీ జగన్నాథ్ భార్యకు విడాకులు ఇస్తున్నాడేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించాడు పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ. ఈ వార్తలు అవాస్తవమని, కావాలనే కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అన్నాడు. మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపాడు.
ఇదిలా ఉంటే అప్పట్లో పూరీ జగన్నాథ్, లావణ్యల పెళ్లిని దగ్గరుండి జరిపించిన అంబర్ పేట్ శంకరన్న వీరి విడాకులపై తాజాగా స్పందించారు. పూరీ విడాకులపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, వాళ్లిద్దరూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారంటూ క్లారిటీ ఇవ్వడం విశేషం. భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన అంబర్ పేట్ శంకరన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.