Amber Heard: ప్రముఖ హాలీవుడ్ హీరో, హీరోయిన్లు, మాజీ భార్యాభర్తల జంట జానీ డెప్, ఆంబర్ హియర్డ్‌లు ప్రేమగా కలుసున్న రోజులకంటే.. విడిపోయి గొడవపడ్డ రోజులే ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లు మాత్రమే కలిసుంది. కలిసున్న రోజులు కూడా ఏదో ఒక వివాదంతో గడిచాయి. 2015లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి వీరి మధ్య గొడవలు ఆగలేదు. 2018 డిసెంబర్‌లో ఆంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ పబ్లిక్ ఫిగర్’’గా పేర్కొనటంతో మరోసారి గొడవ మొదలైంది. మాజీ భార్య మాటలతో ఆగ్రహించిన జానీడెప్ ఆంబర్‌పై పరువు నష్టం దావా వేశాడు. ఆంబర్ తనను గృహ హింసకు పాల్పడిన వ్యక్తిగా పేర్కొందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు పరిహారంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు కోరాడు.
ఇక అప్పటినుంచి కేసు నడుస్తూనే ఉంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించిన కోర్టు విచారణ జరిగింది. ఆంబర్ తన స్టేట్‌మెంట్‌ను వినిపించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డెప్, ఆంబర్‌ల మధ్య గొడవలను కొంతమంది కామెడీ చేస్తున్నారు. మాటల్లేని వీడియోకు వ్యాఖ్యలు జతచేసి వైరల్ చేస్తున్నారు. జానీ డెప్‌ను చూసి ఆంబర్ భయపడ్డ ఓ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఆంబర్ స్టేట్‌మెంట్ బోన్‌నుంచి కిందకు దిగి వస్తుంది. అదే సమయంలో జానీ డెప్ స్టేట్‌మెంట్ బోన్‌లోకి వెళ్లటానికి ముందుకు వెళతాడు. అతడ్ని చూడగానే ఆమె టక్కున ఆగిపోతుంది.
దెయ్యాన్ని చూసినట్లు ముఖం పెట్టి, వెనక్కు వెళుతుంది. ఆ వెంటనే ఓ పక్కగా నిలబడుతుంది. అది చూసిన జానీ డెప్ వెరైటీగా ముఖం పెట్టి, వెనక్కు వచ్చేస్తాడు. పక్కకు వచ్చి నిలబడతాడు. లేడీ పోలీస్ సహాయంతో ఆంబర్ అక్కడినుంచి వెళ్లిపోతుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ న్యాయవాదులు గనుక ఆమె అమాయకురాలు అని నమ్మితే.. వాళ్లసలు న్యాయవాదులే కాదు..’’.. ‘‘ ఆంబర్ ఎన్ని రోజులు ఇలా అందర్నీ మోసం చేస్తుంది. అందరికీ తెలుసు ఆమె తప్పు చేసిందని’’.. ‘‘ ఆమెకంత సీను లేదు.. అంతా యాక్టింగ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: వైరల్ గా మారిన కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి రచ్చ! తప్పు ఎవరిది?