Amber Heard: ప్రముఖ హాలీవుడ్ హీరో,హీరోయిన్లు, మాజీ భార్యాభర్తల జంట జానీ డెప్, ఆంబర్ హియర్డ్‌ల మధ్య ఏళ్లు గడుస్తున్నా వివాదాలు సద్దుమణగటం లేదు. 2015 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లకే విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత విడివిడిగా ప్రశాంతంగా ఉంటారనుకుంటే ఆంబర్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి. 2018 డిసెంబర్‌లో ఆంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ పబ్లిక్ ఫిగర్’’గా పేర్కొంది. అయితే, జానీడెప్ పేరు బయటకు చెప్పలేదు. అయినప్పటికి జానీడెప్ ఆంబర్‌పై పరువు నష్టం దావా వేశాడు. ఆంబర్ తనను గృహ హింసకు పాల్పడిన వ్యక్తిగా పేర్కొందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు పరిహారంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు కోరాడు. 2018నుంచి కేసు నడుస్తూనే ఉంది. గురువారం ఆంబర్ హియర్డ్ కోర్టులో తన స్టేట్‌మెంట్‌ను వినిపించింది. తనపై జానీ డెప్ దారుణాతి దారుణాలకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన దాన్ని చెబుతూ కన్నీటి పర్యంతమైంది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ జరిగిన వన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఓ సారి బాటిల్‌తో నా ముఖం, గొంతు, దవడ భాగంపై కొట్టాడు. పెళ్లయిన రెండు వారాల తర్వాత ఓ రోజు రాత్రి నా గదికి వచ్చాడు. నా నైట్ గౌన్ విప్పిపడేసి ఓ లిక్కర్ బాటిల్‌ను నా జననాంగంలో పెట్టాడు. చాలా నీచంగా ప్రవర్తించాడు. నేను ఎలాగోలా అతడినుంచి తప్పించుకుని నా గదినుంచి బయటకు వచ్చేశా. తర్వాతి రోజు ఉదయం అక్కడికి వెళ్లి చూస్తే అతడి రక్తంతో గోడలపై, అద్దాలపై పిచ్చి పిచ్చి రాతలు రాశాడు. జేమ్స్ ఫ్రాంకోతో నాకు ఎఫైర్ ఉందని అనుమానిస్తూ నన్ను వేధించాడు. నన్ను నీచంగా తిట్టేవాడు. పెళ్లి కాకముందు 2014లో కూడా దారుణంగా ప్రవర్తించేవాడు. ఓ సారి విమానంలో అతడి పక్కనుంచి వేరే సీటుకు మారాను. అంతే! నన్ను అందరిముందు కాలితో తన్నాడు. అక్కడున్న వారు ఎవ్వరూ ఏమీ అనలేదు. మౌనంగా చూస్తూ ఉండిపోయారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, ఆంబర్ హియర్డ్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Khatija Rahman: పెళ్లి చేసుకున్న AR రెహ్మాన్ కూతురు..! పిక్స్ వైరల్..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.