Amalapaul: ప్రముఖ హీరోయిన్ అమలాపాల్‌ను వేధింపులకు గురిచేసిన కేసులో ఆమె మాజీ ప్రియుడు, సింగర్ భవ్‌నిందర్ సింగ్ అరెస్టయ్యాడు. అమలాపాల్ వేసిన పరువు నష్టం దావా కేసుపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు భవ్‌నిందర్ అరెస్ట్‌కు ఆదేశించింది. ఇక, వివరాల్లోకి వెళితే.. భర్తతో విడాకుల తర్వాత అమలాపాల్‌కు సింగర్ భవనిందర్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఓ సినిమాకు సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత విభేదాల కారణంగా దూరమయ్యారు.
కొన్ని నెలల తర్వాత భవ్‌నిందర్ అమలాపాల్‌తో తనకు పెళ్లి అయినట్లు కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత వాటిని తీసేశాడు. అయితే, అప్పటికే అవి స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్‌గా మారాయి. ఆ పెళ్లి ఫొటోలపై అమలాపాల్ స్పందించారు. అవి ఓ పెళ్లి థీమ్ ఫొటో షూట్‌కు సంబంధించినవని తెలిపారు. తాను ఎవర్నీ పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. అతడు ఆ ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు.
2020, నవంబర్ నెలలో ఆమె చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. భవ్‌నిందర్ మీద పరువు నష్టం దావా వేసింది. అతడు తన నిధుల్ని, ఆస్తుల్ని పాడు చేశాడని కోర్టుకు తెలిపింది. తనను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడని పేర్కొంది. అమలాపాల్ పరువు నష్టం దావా కేసుపై మంగళవారం కోర్టు తుది తీర్పునిచ్చింది. భవ్‌నిందర్ సింగ్ అరెస్టయ్యాడు. మరి, అమలాపాల్‌ను వేధించి అరెస్టైన సింగర్ భవ్‌నిందర్ సింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Brahmaji: నెటిజన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ