అమలా పాల్.. మైనా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి సినిమాలో అమలా పాల్ చేసిన క్యారెక్టర్.. అప్పట్లో పెను సంచలనంగా మారింది. కెరీర్ ప్రారభంలోనే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి అని.. అమలాపాల్ అలాంటి డేరింగ్‌స్టెప్ వేశారని ఎందరో ప్రశంసించారు. ఆ తరువాత తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేసింది. తెలుగులో రామ్ చరణ్, బన్నీ, నాగ చైతన్య సరనస హీరోయిన్‌గా చేసింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. విడాకులు తీసుకుంది.
ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో అమలా పాల్ నటించిన ‘ఆమె’ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించింది.. ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కథా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ ఇన్నాళ్ల తన కెరీర్, ఇండస్ట్రీ, వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న అనేక అంశాలను వెల్లడించింది. ఆ వివరాలు..
ఈ సందర్భంగా అమలా పాల్ మాట్లాడుతూ.. ‘‘కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. కొన్ని సినిమాల్లో నా కన్నా పెద్ద వయసు హీరోలతో నటించాను. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జీవితంలో ఒకానొక దశలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆసమయంలో ఓసారి వెనక్కితిరగి చూసుకుంటే.. విజయం కోసం పాకులాడినట్లు అనిపించింది. వాస్తవానికి దూరంగా బతుకుతున్నట్లు అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఆ సయమంలో ఎంతో ఇబ్బంది పడ్డాను.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్తే మంచిది అని భావించాను. అదే సమయంలో మా నాన్న చనిపోయాడు. అప్పుడు నన్ను ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ పోరాడి నిలబడిగలిగాను’’ అటూ చెప్పుకొచ్చింది. ప్రసుత్తం అమలా పాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.