ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో బన్నీ కూడా ఓ మూవీకి సైన్ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా మురగదాస్‌తో సినిమా చేసేందుకు బన్నీఆసక్తి చూపినట్లు సమాచారం.
గజిని-2 సీక్వెల్ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎప్పటినుంచో గజినీ మూవీ సీక్వెల్ తీయాలని భావిస్తున్న మురగదాస్‌కు ఇప్పుడు హీరో దొరికేశాడని, ఇందుకు బన్నీ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సూర్య, అసిన్ హీరో, హీరోయిన్లుగా 2005లో వచ్చిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గజిని సీక్వెల్‌గా మురగదాస్ మరో కొత్త కథను రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ వర్షన్‌లో బన్నీ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.