బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయనలోని మరో యాంగిల్‌ని.. బాలయ్యను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసిన షో అనస్టాపబుల్. గెస్ట్‌లను హాట్ సీట్‌లో కూర్చోపెట్టి.. మెల్లిగా మాటల్లోకి దింపి.. ఎన్నో చిక్కు ప్రశ్నలని సంధిస్తూ.. గెస్ట్‌లకు టెన్షన్.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ.. అనస్టాపబుల్‌ని టాక్ షోలకే బాప్ షోగా మార్చారు బాలకృష్ణ. ఇక తాజాగా బాలయ్య అల్లు శిరీస్ నటించిన ఊర్వశివో రాక్షసివో.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చారు. సాధారణంగా బాలకృష్ణ వేరే సినిమా ఫంక్షన్లకు వెళ్లడం చాలా అరుదు. అలాంటిది ఆయన అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చారంటనే.. ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను అందరి సమక్షంలో అల్లు శిరీష్ కొన్ని ఫన్నీ, కొంటె ప్రశ్నలు అడిగారు. దీనిలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి అడిగిన ప్రశ్న.. అందుకు బాలయ్య చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ బాలయ్యని ఉద్దేశించి.. మీ సినిమాల్లో నటించిన పలువురు హీరోయిన్ల పేర్లు చెప్తాను. వారిలో ఊర్వశి ఎవరు.. రాక్షసి ఎవరు అని ప్రశ్నించి.. ముందుగా విజయశాంతి పేరు చెప్పాడు. బాలకృష్ణతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ ఈమె. ఈ నేపథ్యంలో అల్లు శిరీష.. విజయశాంతి.. ఊర్వశా, రాక్షసా అని ప్రశ్నించాడు. కానీ, బాలయ్య సమాధానం చెప్పలేదు. మిగతా ముగ్గురు పేర్లు కూడా చెప్పు.. అప్పుడు చెప్తా నా సమాధానం అని మెలిక పెట్టారు బాలయ్య.
దీంతో అల్లు శిరీష్ వరుసగా.. విజయశాంతి, సిమ్రన్, నయనతార, శృతిహాసన్ పేర్లు చెప్పుకొచ్చాడు. అప్పుడు బాలయ్య చాలా తెలివిగా నయనతార.. ఊర్వశి.. శుత్రి హాసన్.. రాక్షసి అని చెప్పారు. మరి మిగిలిన ఇద్దరు హీరోయిన్లు సార్ అని శిరీష్ అడగానే.. ‘‘అయిపోయిందిగా.. సమాధానం చెప్పానుగా. నువ్వు ఇద్దరినే అడిగావ్. ఇక తిలోత్తమా, రంభ అవన్నీ వేరు. నువ్వు వాళ్ల గురించి అడగలేదు’’ అంటూ బాలయ్య తప్పించుకున్నారు. ఇక దీనితో పాటు శిరీష్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.