ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. గతేడాది డిసెంబర్ లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. పుష్ప దెబ్బకి అనేక రికార్డులు బద్దలయ్యాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప..తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డులోనూ పుష్ప మూవీ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లింది. 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ‘పుష్ప’ క్లీన్ స్వీప్ చేసింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది.
బెంగళూరు నగరంలో ఆదివారం రాత్రి 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప హవా కనిపించింది. ఈ చిత్రానికి ఏడు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. ఈ విషయంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో ‘పుష్ప’ సత్తా చాటిందని అల్లు అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్పీప్.. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఇతర అవార్డుల విషయానికి వస్తే…టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన ‘సురారై పొట్రు’ మూవీకి అవార్డు లభించింది.
THANK YOU 🖤 pic.twitter.com/1zlOcNx2sS
— Allu Arjun (@alluarjun) October 10, 2022
#PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽
— Allu Arjun (@alluarjun) October 10, 2022