ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లందరూ దీపావళి పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా టపాసులు కాలుస్తూ పండగని ఎంజాయ్ చేశారు. చాలామంది నటీనటులు.. దీపావళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో అయితే నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో పిల్లలతో కలిసి బన్నీ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గతేడాది డిసెంబరులో ‘పుష్ప’ రిలీజైంది. అప్పటినుంచి బన్నీ పేరు వరల్డ్ వైడ్ మార్మోగిపోయింది. ఇక గత కొన్ని నెలల్లో పలు అవార్డులు కూడా అల్లు అర్జున్ ని వరించాయి. తాజగా ‘పుష్ప’ సీక్వెల్ కి సంబంధించిన ఫొటోషూట్ జరిగింది. త్వరలో మెయిన్ షూటింగ్ మొదలవుతోంది. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తనకు దొరికిన ఖాళీ సమయాన్ని పిల్లలతో బన్నీ గడుపుతున్నాడు.
తాజాగా దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని ఇంట్లో పిల్లలతో కలిసి అల్లు అర్జున్ పండగని ఎంజాయ్ చేశాడు. కూతురు అర్హ, కొడుకు అయాన్.. చుంచు బుడ్డిలు కాల్చడానికి భయపడ్డారు. వారిని దగ్గరకు తీసుకెళ్లి మరీ వాటిని వెలిగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. మరోవైపు దీపావళి సందర్భంగా పిల్లలతో ఎంజాయ్ చేయడం కంటే ముందు.. మెగా కజిన్స్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరి బన్నీ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.