సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో నిత్యం బిజీబిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త గ్యాప్ దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతారు. తాజాగా ఆయన తన కూతురు అర్హతో కలసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల కోసం ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సైలిష్ యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్సులు, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అందరికీ ఆయన కనెక్ట్ అయిపోయారు. ‘పుష్ప’ చిత్రానికి ముందువరకు టాలీవుడ్, మాలీవుడ్‌కే పరిమితమైన బన్నీ ఇమేజ్.. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది. ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ చిత్రీకరణలో బన్నీ బిజీబిజీగా ఉన్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న దృష్ట్యా మేకింగ్, క్వాలిటీ విషయంలో బన్నీ, సుకుమార్‌లు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని సమాచారం. ఈ చిత్రం నుంచి త్వరలో ఓ క్రేజీ అప్‌డేట్ రానుందని టాక్.
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ నుంచి ఓ యాక్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది ఆ మూవీ మేకర్స్‌కే తెలియాలి. ఇదిలాఉండగా.. ఎప్పుడూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే బన్నీ, కాస్త తీరిక దొరికినా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. కూతురు అర్హతో ఆడుకోవడం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పొచ్చు. అందుకే కూతురితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తుంటారు బన్నీ. తాజాగా అర్హతో కలసి బన్నీ దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక సోఫాలో కూర్చున్న అల్లు అర్జున్.. యోగాసనాలు వేస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతున్నారు.
Good Morning 🌞 pic.twitter.com/HmSSdun8pg
— Allu Sneha Reddy (@AlluSnehaReddy_) March 21, 2023