ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ గా బన్నీ యాటిట్యూడ్, నటన, రగ్డ్ మాస్ లుక్.. ఇలా అన్నివిధాలా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరినట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో.. పుష్పరాజ్ గా బన్నీ యాటిట్యూడ్, నటన, రగ్డ్ మాస్ లుక్.. ఇలా అన్నివిధాలా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. వెరసి.. బన్నీకి అన్ని మేజర్ అవార్డుల వేడుకలలో బెస్ట్ యాక్టర్ గా అవార్డులు వరించాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులతో పాటు.. ఇప్పటిదాకా సౌత్ స్టార్స్ అందుకోలేని అరుదైన పాపులర్ మ్యాగజైన్స్ లోను బన్నీ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. పుష్పతో బన్నీ క్రేజ్ వరల్డ్ వైడ్ విస్తరించిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్పతో పెరిగిన క్రేజ్ ని పుష్ప 2 ద్వారా రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలో బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరినట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ గా సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన ఇంపాక్ట్ చూపించిన బన్నీ.. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తనకంటూ ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. తగ్గేదేలే అంటూ.. తాజాగా 20 మిలియన్స్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ని సంపాదించుకొని కొత్త రికార్డు అందుకున్నాడు. దక్షిణాది నుండి ఈ మైలురాయి అందుకున్న మొదటి హీరోగా బన్నీ తన పేరు నిలుపుకున్నాడు. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా కింగ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.