ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప. రెండు పార్టులుగా రాబోతున్న సుకుమార్ క్రేజీ ప్రాజెక్టుకు లీకుల బాధ తప్పడం లేదు. ఈ విధంగా లీకులైతే సినిమా పరిస్థితి ఏంటని బన్నీ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి మరో ఫైట్ సీన్ లీకవడంతో మైత్రీ మూవీస్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
తాజాగా బన్నీ కూడా లీకులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ యూనిట్‌కు వచ్చే టీమ్ సెల్‌ఫోన్స్ తీసుకురాకుండా చూడాలని మేకర్స్ ను ఆదేశించాడు బన్నీ. మైత్రీ మూవీస్ సంస్థ లీకులకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఈ జాగ్రత్తలేవో ముందో ఉంటే ఇంత దాకా వచ్చేది కాదంటూ బన్నీ అభిమానులు హితవు పలుకుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటిస్తోంది. తాజాగా పుష్ప నుంచి విడుదలైన దాక్కో మేక సాంగ్‌తో సినిమాలో బన్నీ లుక్స్, మేనరిజం, పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఓ క్లారిటీ వచ్చేసింది. దాక్కో మేక ఫుల్ ట్రెండ్ అవ్వడమే కాకుండా.. అభిమానుల్లో ‘పుష్ప’పై అంచనాలు పెంచేసింది.
Icon StAAr #AlluArjun shocked, upset & angry after knowing #Pushpa leaks.
He has ordered the makers to prohibit the crew from carrying mobile phones to the editing unit.
Case is registered with cyber crime police & the investigation is underway. pic.twitter.com/N44OmrVvbV
— Manobala Vijayabalan (@ManobalaV) August 17, 2021