అల్లు అర్జున్.. ఒకప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం ఉన్న స్టైలిష్ స్టార్.. పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా హీరోగా ఎదిగి.. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది పుష్ప సినిమా ఫిలింఫేర్, సైమా అవార్డులు దక్కించుకోవడంతో.. ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇప్పుడు వారి సంబరాలను రెట్టింపు చేసే వార్త మరొకటి వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ మరో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నాడు. పైగా టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఆ వివరాలు..
2022 సంవత్సరానికి గాను GQ మ్యాగజైన్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. బన్నీ ఈ అవార్డు అందుకున్న ఫోటోలు ప్రసుత్తం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఫ్యాషన్, కల్చర్, పాలిటిక్స్ వంటి విభాగాల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వాళ్లకు ఈ అవార్డ్స్ అందజేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నా. ఇక GQ మ్యాగజైన్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గాను తనను ఎంపిక చేసినందుకు.. జీక్యూ టీమ్ సహా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్.
ఇక పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బన్నీ ఫ్యాన్ బేస్ రెట్టింపు కావడమే గాక.. ఐకాన్ స్టార్‌కి ఆల్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కింది. ఇక సుకుమార్ రూపొందించిన ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు దేశవ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాశాయి. ఇక పుష్ప సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప2ను ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
‘పుష్ప: ది రూల్’ పేరుతో రాబోతున్న ఈ సీక్వల్ మూవీని ఏకంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకొని చిత్ర బృందం ముందుకు వెళ్తుందట. ఇక తాజాగా పుష్ప 2 షూటింగ్ ప్రారంభించారు సుకుమార్. ప్రస్తుతం ఈ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పుష్ప 2 కోసం అభిమానులు ఊగిపోయేలా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన సుకుమార్.. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. మరి బన్నీ అందుకున్న ఈ అవార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.