ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. డిసెంబర్ 17, 2021 న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాక.. జనవరి ఏడు నుంచి పుష్ప ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో పుష్ప రానుంది.
ఇది కూడా చదవండి: తగ్గేదే లే అంటూ.. అల్లు అర్జున్‌ను దించేసిన డేవిడ్ వార్నర్! వీడియో వైరల్
ఇక పుష్ప సినిమా కోసం అమెజాన్ భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది. 22 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. థియేటర్ లో విడుదైల కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకముందే పుష్ప ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలిసింది. సంక్రాతి కానుకగా.. జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీలో కూడా పుష్పకు ఇంత భారీ ధర పలకడం పట్ల బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా పుష్ప నాలుగు భాషల్లో(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) విడుదల అవుతుంది. అమెజాన్ ఇంత భారీ ధర చెల్లించి పుష్ప సినిమాను కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇది కూడా చదవండి : బన్నీ ఇదే ఒరిజినల్.. శ్రీవల్లిని మర్చిపోయారా!