‘పుష్ప’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ బుకింగ్ ఇచ్చిన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అయితే ఇలాంట తరుణంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఒకవైపు హిందీ సినిమా సెన్సార్ కూడా పూర్తి కాకపోవడం ఒక షాక్ అయితే ఇప్పుడు పుష్పకు మరో షాక్ తగిలింది. పుష్ప డిసెంబరు 17న రిలీజ్ కావడం కష్టం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రిలీజ్ అయినా కూడా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే పుష్ప సినిమా DTS మిక్సింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. రేపు రిలీజ్ ఉంటే ఇంకా క్వాలిటీ మిక్సింగ్ పనులు పూర్తి కాకపోవడం మొత్తం సినిమా యూనిట్ ను కలవరపెడుతోంది. ఒక వేళ జరిగినా కూడా కేవలం తెలుగులోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. హిందీ సెన్సార్ విషయం కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది పుష్ప సినిమాకి, అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో నిరాశను కలిగించే విషయమే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కోసం అభిమానులు ఎంతో ఆతురతాగా ఎదురు చూస్తున్నారు. ప్రీ బుకింగ్ లు మొత్తం బుక్ అయిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప బాహుబలి-1 రికార్డును కూడా అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప రిలీజ్ విషయంలో చిత్ర బృందం రిలీజ్ గురించి అధికారికంగా ధ్రువీకరిస్తుందోమో చూడాలి. డిసెంబరు 17న పుష్ప రిలీజ్ కావడం ఖాయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.