ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప సినిమా ఇచ్చిన విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియాకి పరిచయం చేసిన పుష్ప మూవీ.. అటు థియేట్రికల్ గా, ఇటు ఒటిటి పరంగా అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించి పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ డైరెక్షన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో అల్లు అర్జున్ కి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ త్వరలోనే స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్నట్లు, అదికూడా ఆహా ఓటిటిలోనే ఒక టాక్ షో ద్వారా అలరించేందుకు రెడీ అవుతున్నాడట. ఆహాలో టాక్ షో చేసేందుకు అల్లు అర్జున్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే.. అల్లు అర్జున్ టాక్ షో కోసం ఆహా బృందం పెద్ద ప్లానే వేసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నిజానికి ఆహాలో అల్లు అర్జున్ కి షేర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల పుష్ప అందించిన బాలీవుడ్ క్రేజ్ గాని, బాలీవుడ్ సెలబ్రిటీల నుండి అందుకున్న ప్రశంసలను దృష్టిలో పెట్టుకొని బన్నీ టాక్ షో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. ఇప్పటివరకు ఆహాలో సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్, నందమూరి బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలు టాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. అందుకు భిన్నంగా అల్లు అర్జున్ చేయబోయే టాక్ షోలో కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆహా టాక్ షో ద్వారా అల్లు అర్జున్ తన బాలీవుడ్ మార్కెట్ మరింత డెవలప్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మార్చి నెల నుండి బన్నీ పుష్ప-2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. ఇంకా బన్నీ టాక్ షో పై క్లారిటీ రావాల్సి ఉంది. మరి బన్నీ ఓటిటి ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.