ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే.. ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి సగటు భర్త, తండ్రి అయిపోతాడు. తన స్టేటస్ మొత్తం పక్కనబెట్టి.. ఓ సాధారణ వ్యక్తిలా పిల్లలతో ఆడుకుంటాడు. భార్యకు ఏదైనా అవసరమొస్తే సాయం చేస్తాడు! సినీ నటుడు కావొచ్చు.. ఓ క్రికెటర్ కావొచ్చు. రియాలిటీలో జరిగేది దాదాపు ఇదే. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరిగింది! కూతురు అర్హ అడిగినందుకు నైట్ రైడ్ చేశాడు. ఆమెకి ఇష్టమైనవన్నీ కొనిపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ కి సిద్ధమవుతున్న బన్నీ.. ఆ తర్వాత కూడా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ టైంని మాత్రం అస్సలు మిస్సవడు. భార్య స్నేహ, పిల్లలు అయాన్-అర్హతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటాడు. కుటుంబంతో కలిసి టూర్స్ కూడా వేస్తుంటాడు. ఇక బన్నీకి కూతురంటే ప్రాణం. అర్హతో బన్నీ చాలా ఫన్నీ వీడియోలే చేశాడు. వాటిని తన ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. రీసెంట్ గా వీళ్లిద్దరూ గణేశ్ నిమజ్జనంలోనూ సందడి చేశారు.
ఇదంతా పక్కన బెడితే.. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడం వల్ల బన్నీ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నాడు. అర్హ రైడ్ కి తీసుకెళ్లమని అడిగినట్లుంది. దీంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్ మొత్తం కారులో రైడ్ వేశారు. అర్థరాత్రి దోశలు తింటూ కూడా కనిపించారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది. కుటుంబంపై బన్నీ చూపిస్తున్న ప్రేమపై అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. బన్నీ ఇలా ఉండటం గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Icon🌟@alluarjun never fails to give us parenthood & family time goals🤗💖
Here’s a cute moment captured as he eats dinner with his daughter #AlluArha in his car🤩#AlluArjun #ShreyasMedia pic.twitter.com/iaGYPtHqke
— Shreyas Media (@shreyasgroup) November 1, 2022