పుష్ప సక్సెస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాకముందే బన్నీ తదుపరి సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇక పాన్ ఇండియా ఫేమ్ రావడంతో బన్నీ కూడా తదుపరి సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా బన్నీ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉందని.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి ఏకంగా 100కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకైనా రెడీ అయినట్లు సినీవర్గాల సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పతో బన్నీ నటుడిగా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదలైన పుష్పతో అల్లు అర్జున్ కి ప్రస్తుతం టాప్ దర్శకులు, నిర్మాతల నుండి ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. ఇదిలా ఉండగా.. బన్నీ – అట్లీ సినిమా పై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ రానుందట.ప్రస్తుతం దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్, నయనతార కాంబినేషన్ లో ‘లయన్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో లేదా 2023 ప్రారంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం అట్లీ, దళపతి విజయ్ తో మరో సినిమా చేయనున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత వేణుశ్రీరామ్ తో ఐకాన్, కొరటాల శివతో ఓ సినిమా, బోయపాటితో మరో సినిమా లైనప్ చేసుకున్నాడు. మరి అట్లీతో సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి అట్లీ – బన్నీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
₹100 cr remuneration for Icon StAAr #AlluArjun in talks for the #Atlee project.
— Manobala Vijayabalan (@ManobalaV) January 31, 2022