Pushpa 2: పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. మొదటి ప్యాన్ ఇండియా సినిమాతోటే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధం అవుతున్నారు. కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించిన నేపథ్యంలో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇక, పుష్ప 2లో అల్లు అర్జున్ 55 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, అది ఎంత వరకు నిజం అన్నదానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ముందెన్నడూ కనిపించని విధంగా బాగా బరువు పెరిగారు.
గత కొన్ని రోజుల్ని ప్రచారం జరుగుతున్నట్లుగా.. 55 ఏళ్ల వయసు వ్యక్తిగా కనిపించటానికి బరువు పెరిగారేమోనన్న టాక్ వినిపిస్తోంది. అయితే, బన్నీ న్యూలుక్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ నేను మొదట చూసి లాసిత్ మలింగ అనుకున్నాను’.. ‘ మోటా భాయ్’.. ‘చాలా రోజుల తర్వాత లాసిత్ మలింగాను చూస్తున్నా’.. ‘వడాపావ్ లుక్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, బన్నీ పుష్ప 2లో క్యారెక్టర్ కోసం బరువు పెరిగారా? లేక వేరే కారణం ఉందా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కి.. 365 కోట్ల రూపాయల మేర వసూళ్లను కొల్లగొట్టింది. దేవీశ్రీ అందించిన మ్యూజిక్.. పాటలు దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. ప్రస్తుతం పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి, అల్లు అర్జున్ కొత్త లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Actor Sai Kiran: నన్ను దారుణంగా మోసం చేశారు.. పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్