తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారారు. ఇప్పటి వరకు మెగా హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రాల్లో నటించలేదు. మొదటిసారిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే పలు అవార్డు ఫంక్షన్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ని ఆప్యాయంగా కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలబెట్రీలు, క్రికెట్ స్టార్లు, రాజకీయ నాయకులు సైతం ఫాలో అయ్యారు. ఇప్పటికీ పుష్ప డైలాగ్ తగ్గేదే లే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ మ్యానరీజం చూపిస్తూనే ఉన్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ కి వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఈ మద్యనే సైమా అవార్డుల్లో పుష్ప మూవీకి అన్ని కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగి వేడుకలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా నీరజ్ చోప్రా, రణ్ వీర్ సింగ్ లతో సందడి చేశాడు. ఆ తర్వాత ప్రముఖ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ని కలిశారు. కపిల్ దేవ్ ని చూడగానే అల్లు అర్జున్ చేతులు జోడించి నమస్కరించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.