తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించిన బన్నీ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఎంత పెద్ద స్టార్ హీరో హూదాలో ఉన్న వారి జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులను కలిస్తే కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్.. 30 ఏళ్ల తర్వాత ఓ ప్రత్యేక వ్యక్తిని కలిసి ఎంతో ఆనందాన్ని పొందారు. అంతేకాదు ఆమె వల్ల తాను ఎన్నో నేర్చుకున్నానని.. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అని పొగిడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సెన్సెషనల్ హిట్ కావడమే కాదు.. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షరవేగంగా నడుస్తుంది. చెన్నైకి చెందిన ఎంటర్ టైన్ మెంట్ వెబ్‌సైట్ బిహైండ్‌వుడ్స్ ఈ మద్య ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ కి అవార్డులు ప్రధానం చేశారు. ‘గోల్డెన్ ఐకాన్ ఆప్ ఇండియన్ సినిమా’ అవార్డు సొంతం చేసుకున్నాడు బన్ని. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి నిర్వాహకులు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు.
అల్లు అర్జున్ చిన్ననాటి స్కూల్ టీచర్ స్టేజ్ పైకి రాగానే ఆనందంతో పొంగిపోయాడు. ఆమె పాదాలకు నమస్కరించాడు.. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘ఈమె పేరు అంబికా కృష్ణన్.. మూడో తరగతిలో నాకు పాఠాలు చెప్పిన టీచర్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ మేడమ్ ని చూశాను.. విద్యను అభ్యసించే సమయంలో ఎంతో మంది టీచన్స్ నాకు క్లాసులు చెప్పారు.. కానీ ఈ మేడమ్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంటారు.. దానికీ ఓ కారణం ఉంది. మా క్లాస్ లో 50 మంది స్టూడెంట్స్ ఉంటే.. నాదే లాస్ట్ ర్యాంక్.. ఎందుకో నాకు పెద్దగా చదువు అబ్బలేదు. కానీ ఈ మేడమ్ నన్ను ఎప్పుడూ తిట్టలేదు..పైగా నీకు మార్కులు రాలేదని ఎప్పుడూ బాధపడకు.. జీవితం అంటే కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులే కాదు.. ప్రతి ఒక్కరికీ జీవితం అనేది ఒక గొప్ప వరం.. నీకు ఉన్న ప్రతిభ నిరూపించుకుంటే.. ఉన్నతశిఖరాలకు ఎదుగుతావు’ అంటూ ప్రోత్సహించేవారు. మేడమ్ ని ఇలా చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Icon Star @alluarjun Meets His School Teacher After 30 Year’s ❤️🔥
Thank You So Much @behindwoods 🥺#Pushpa2TheRule #PushpaTheRule pic.twitter.com/0IdGBj2PTL
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) May 9, 2023