‘పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. ఫైర్’ ఈ ఒక్క డైలాగ్ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఫేక్ చేసింది. దేశం మొత్తం ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. తాజగా, విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది..
పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కొంతమంది ఆయన ఫ్యాన్స్‌గా కూడా మారిపోయారు. పుష్ప 2 సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై పోయింది. కొన్ని ముఖ్యమైన సీన్లు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి. తాజాగా, పుష్ప 2కు సంబంధించిన ఓ టీజర్ వీడియో యూట్యూబ్లో విడుదలై సంచలనం సృష్టించింది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ మాస్ ఎంట్రీకి సంబంధించిన వీడియో అది. ఇంతకీ సంగతేంటంటే.. అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం బిహైండ్‌ది వుడ్స్ సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు తీసిన వీడియోను బిహైండ్‌ది వుడ్స్ తమ యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్ సూట్లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ ఫ్లోర్‌ను ఫైర్‌లో పెట్టేసింది. పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. అన్నట్లుగా ఫైర్ రేంజింగ్ ఎంట్రీని ఇచ్చారు.
కార్యక్రమం చూడ్డానికి వచ్చిన వేల మంది ఆయనను చూడగానే కేకలు వేయటం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ అందరికీ అభివాదం చేస్తూ.. అక్కడే ఉన్న తోటి సినిమా వాళ్లను పలకరించి తనకు కేటాయించిన సీటులో వెళ్లి కూర్చున్నారు. ఈ మాస్ ఎంట్రీపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ అందరి కళ్లూ అల్లు అర్జున్‌పైనే ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ’’.. ‘‘పుష్ప రూల్ ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, అల్లు అర్జున్ గూస్‌బమ్స్ మాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.