ప్రస్తుతం సినీ ప్రపంచమంతా RRR సినిమా గురించే మాట్లాడుకుంటుంది. దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మాసివ్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద విజయవిహారం చేస్తోంది. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం.. ఇండియన్ సినీ చరిత్రలోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ చిత్రం మొదటిరోజు కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్.. 223 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రాజమౌళి సినిమా అంటే.. సామాన్య ప్రేక్షకుడి నుండి బిగ్ సెలబ్రిటీస్ వరకు అందరిలో అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఇక సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా విష్ చేస్తున్నారు.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ RRR సినిమా పై ట్వీట్ చేశాడు. “RRR చిత్ర యూనిట్ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన సినిమా అందించిన రాజమౌళి గారి గ్రేట్ విజన్ పై మరింత రెస్పెచ్త్ పెరిగింది. మెగా బ్రదర్.. మెగా పవర్ రాంచరణ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నా బావ.. పవర్ హౌస్ తారక్.. అదరగొట్టాడు. స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ బ్రిలియంట్ గా నటించారు. అలాగే కీరవాణి గారికి, సినిమాటోగ్రఫీ సెంథిల్ కి ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ ట్రిపుల్ ఆర్ టీమ్ అందరినీ విష్ చేశాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి బన్నీ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Hearty Congratulations to the Entire team of #RRR . What a spectacular movie. My respect to our pride @ssrajamouli garu for the vision. Soo proud of my brother a mega power @AlwaysRamCharan for a killer & careers best performance. My Respect & love to my bava… power house
— Allu Arjun (@alluarjun) March 26, 2022