రామ్ చరణ్ పార్టీలో బన్నీ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఆదివారం రాత్రి ఉపాసన బేబీ షవర్ కి అల్లు అర్జున్ అటెండ్ అయ్యాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. చెర్రీ భార్య ఉపాసన.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ టైమ్ ని చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది. రీసెంట్ గా చరణ్ నానమ్మ అంజనాదేవి వంటని టేస్ట్ చేసిన ఉపాసన.. తాజాగా ఆదివారం రాత్రి బేబీ షవర్ వేడుక చేసుకుంది. కొన్నాళ్ల ముందు దుబాయిలో ఈ వేడుక చేసుకున్న ఉపాసన.. ఇప్పుడు హైదరాబాద్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి మరోసారి టైమ్ స్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య చిన్న చిన్న విబేధాలు వచ్చాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఉపాసన బేబీ షవర్ వేడుకకు బన్నీ అటెండ్ కావడంతో అవన్నీ ఒట్టి రూమర్స్ అని తేలిపోయాయి. ఉపాసనతో తీసుకున్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన బన్నీ.. చరణ్-ఉపాసన జంటకు విషెస్ చెప్పాడు. దీంతో మెగా-అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే ఈవెంట్ లో ఉపాసన క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది పాల్గొన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా కనిపించింది.
మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉంది. త్వరలో డెలివరీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మూడు నెలలు షూటింగ్స్ కి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం తన భార్య ఉపాసనకు చరణ్ ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సో అదనమాట విషయం. మరి ఉపాసన బేబీ షవర్ వేడుకకు బన్నీ అటెండ్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.