ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జబర్దస్త్ అవినాష్ కు సోషల్ మీడియా వేదికగా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు అవినాష్ చేసిన పనేంటి? బన్నీ ఫ్యాన్స్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో అభిమానులు మరో హీరోపై విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం చూస్తూనే ఉంటాం. దాంతో మా హీరోపై ట్రోల్స్ చేస్తారా అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు ఆ హీరో ఫ్యాన్స్. ఈ విమర్శలు ఒక్కోసారి గొడవలు జరిగి కొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ ఓ కమెడియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి ఆ కమెడియన్ ఎవరు అని అనుకుంటున్నారా? అతడే జబర్దస్త్ అవినాష్. అసలు అవినాష్ చేసిన పనేంటి? బన్నీ ఫ్యాన్స్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ అవినాష్.. తనదైన కామెడి టైమింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక బిగ్ బాస్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. దాంతో అవినాష్ కు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ అవినాష్ చేసిన పని ఏంటి అనేగా మీ డౌట్? తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా.. పుష్ప2 నుంచి టీజర్ తో పాటుగా.. ఓ పోస్టర్ ను కూడా వదిలారు సుకుమార్, బన్నీ. ఈ పోస్టర్ టాలీవుడ్ నే షేక్ చేసిందని చెప్పొచ్చు. అమ్మవారి రూపంలో బన్నీ ఊర మాస్ పిక్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి.
ఇక పిక్ ను అవినాష్ అరకొర ఎడిటింగ్ చేసి తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టుకున్నాడు. ఈ ఓన్ మేడ్ పిక్ తో బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు అవినాష్. ఇప్పుడు ఈ ఫోటోనే అవినాష్ కు తిప్పలు తెచ్చింది. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్ కు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అర్జెంట్ గా ఆ పిక్ ను డిలీట్ చెయ్.. ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు. ఇక అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జెంట్ గా డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్స్ సైతం ఇస్తున్నారు. మరి ఈ వార్నింగ్ లపై అవినాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.