మనం ఏ ఎమోషన్ ని అయినా సరే దాచుకోవడం కష్టం. ఒకవేళ అలా చేసినా సరే కొన్ని సందర్భాల్లో అది బయటపడిపోతుంది. అది మనలాంటి మనుషులకు అయినా, సెలబ్రిటీలకు అయినా సరే. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయాడు. తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే కన్నీల్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’.. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమాని రిలీజ్ చేసిన శిరీష్.. హిట్ కొట్టేశాడు! ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ చిత్రం చూసి యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ అలా ఉంది మరి. ఆ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లలో వీళ్ల రెచ్చిపోయి నటించారు. ఇక సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అల్లు శిరీష్ మాట్లాడుతున్న టైంలో తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
‘అరవింద్ గారి అబ్బాయిలా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నప్పుడు ‘మై బేబీ శిరి’ అని రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తనని నేను కలిస్తే.. చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. తనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేను ఏదైనా జీవితంలో సాధించాలనుకుంటే అవేవి మిగల్చకుండా పెట్టాడు. అందుకు కూడా తనకు థాంక్స్. వచ్చే ఏడాది పుష్ప 2తో బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. మరోసారి తెలుగు సినిమా స్థాయేంటే దేశానికి చూపిస్తున్నారు’ అని శిరీష్ చెప్పాడు. ఇక తన తమ్ముడు స్టేజీపై తన గురించి చెప్పడంతో బన్నీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.