స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పక్కా కమర్షియల్ స్టార్. మాగ్జిమమ్ ప్రయోగాలు చేయడానికి దూరంగానే ఉండిపోతుంటాడు. ట్రెండ్‌కు తగ్గ పాత్రల్లోనే కనిపిస్తుంటాడు. పైగా అతని స్టైలిష్ నెస్‌కు ఇప్పటి యూత్‌లో చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకే బద్రినాథ్, రుద్రమదేవీ సినిమాలు మినహా.. కొత్త జోనర్ ఎప్పుడూ ట్రై చేయలేదు. డీగ్లామర్ రోల్స్ చేయడం, మేకోవర్ మార్చుకోవడం వంటివి ట్రై చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రయోగాలు మాత్రమే చేస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ.. స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా. తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఫుల్ టూ ఫుల్ మాస్ అప్పీయరెన్స్‌తో కూడి రోల్ చేయలేదు బన్నీ. కానీ ‘పుష్ప లో రగ్గుడ్ లుక్ లో లారీ డ్రైవర్ పాత్ర చేస్తూ అట్రాక్షన్‌గా మారాడు. ఇప్పటికే ఈ పాత్ర గురించి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంటే… అల్లు వారి అబ్బాయి ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో’పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రానుండగా.. ‘పుష్ప-1’ ముగింపు దశలో ఉంది. సెకండ్ పార్ట్ మొదలుపెట్టడానికి కాస్త టైమ్ పట్టేలా ఉండటంతో.. ఈ గ్యాప్‌లో ‘ఐకాన్’ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టుగా ప్రచారం జరగుతోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో బన్నీ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. అదేమిటంటే బన్నీ ఇందులో చూపులేని వ్యక్తిగా కనిపిస్తారని. అందుకే ‘ఐకాన్’ టైటిల్ కింద ‘కనబడటలేదు’ అని ట్యాగ్ లైన్ పెట్టబోతున్నారని అంటున్నారు. అదే జరిగితే బన్నీ పూర్తిస్థాయిలో ప్రయోగం చేయబోయే సినిమా ఇదే. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.