కొన్నేళ్లుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరోల హవా నడుస్తుందనే చెప్పాలి. బాహుబలి, రోబో 2.o, సాహో, మొదలుకొని ఇటీవలి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాల వరకూ పాన్ ఇండియా స్థాయిలో సౌత్ హీరోలే రికార్డులు సృష్టిస్తున్నారు. మంచి కంటెంట్, యాటిట్యూడ్, హీరోయిజం కూడిన సినిమాలతో దేశవిదేశాల ప్రేక్షకులను అలరిస్తూ.. ఊహకందని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ అనగానే అందరికి గుర్తొచ్చే హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, యష్, ఎన్టీఆర్, దళపతి విజయ్ లాంటి దక్షిణాది స్టార్లే కావడం విశేషం. అయితే.. కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసే సినిమాలు లేదా సౌత్ ఆడియెన్స్ మెచ్చే సినిమాలు రాలేదు. కానీ.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలు సౌత్ లో తెరకెక్కుతుండటం.. బాలీవుడ్ క్రేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం.
ఈ మధ్యకాలంలో పక్కాగా కంటెంట్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతున్నారు ఆడియెన్స్. ఇక గతేడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకొని ఐకాన్ స్టార్ గా అవతరించాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ దేశాలు దాటి ఖండాంతరాలకు పాకింది. సినీ సెలబ్రిటీల నుండి పొలిటిషన్స్, ఇంటర్నేషనల్ క్రీడాకారుల వరకూ పుష్పరాజ్ ‘తగ్గేదేలే’ స్వాగ్ వ్యాపించింది.
పుష్ప మూవీలో బన్నీ యాక్షన్, స్వాగ్, డైలాగ్ డెలివరీతో క్రియేట్ చేసిన మాస్ ఫీస్ట్ కి.. ఇప్పుడు ప్రేక్షకులంతా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల ఉనికిని చాటుతూ ప్రముఖ వారపత్రిక ‘ఇండియా టుడే’ కవర్ స్టోరీని ప్రచురించింది. ఇందులో భాగంగా కవర్ పేజీపై పుష్ప స్వాగ్ తో కూడిన అల్లు అర్జున్ స్టిల్ ని ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ స్టిల్ బట్టే దేశవ్యాప్తంగా పుష్ప 2పై ఎంత ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం బన్నీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇండియా టుడే కవర్ పేజీపై బన్నీ కనిపించేసరికి ఫ్యాన్స్ లో సంతోషం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో బన్నీ స్టిల్ షేర్ చేస్తూ ‘నీయవ్వ తగ్గేదే లే’ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి కవర్ పేజీలో బన్నీ స్టిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Look who’s featuring on @IndiaToday ?
It’s #Pushpa Pushpa Raj 🔥🔥
The impact @alluarjun created with #PushpaTheRise is unmatchable & unimaginablePeople across the nation loved his performance and the film.
Now #AlluArjun featured on #IndiaToday#PushpaTheRise Unstoppable pic.twitter.com/aWkhmmAyGD— Thyview (@Thyview) July 15, 2022
#AlluArjun‘s Pushpa breaks another record, first Indian album to get 5 billion views#PushpaTheRise https://t.co/QoRVZwHWdX pic.twitter.com/whzPlQZIki
— Business Insider India🇮🇳 (@BiIndia) July 15, 2022