ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో పుష్ప పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పుష్ప మూవీని నిర్మిస్తుంది. డిసెంబర్ 17న పుష్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
అయితే.. రిలీజ్ దగ్గర పడటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా జరుపుతోంది. తాజాగా అల్లు అర్జున్, రష్మిక ఇతర చిత్రబృందం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ కి హీరో అల్లు అర్జున్ సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు కన్నడ మీడియా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బన్నీ క్షమాపణలు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు కూడా వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.