సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ.. ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఇక అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. అభిమానులకు కనువిందు చేశారు. ఇంతకు ఈ ఇద్దరు స్టార్లు.. ఎక్కడ కలిశారు.. ఏ వేదికపై ఈ సీన్ చోటు చేసుకుంది అంటే.. దర్శకుడు గుణశేఖర్.. కుమార్తె నీలిమ గుణశేఖర్ రిసెషన్ వేడుకలో ఈ సీన్ కనిపించింది. ఆ వివరాలు.. దర్శకుడు గుణశేఖర్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మార్కు క్రియేట్ చేసుకున్నాడు. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి కమర్షియల్ చిత్రాలతో పాటు.. రుద్రమదేవి, శాంకుతలం వంటి హిస్టారికల్ సినిమాలను తెరకెక్కించి.. అన్ని రకాల సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇక గుణశేఖర్ సినిమాలు అంటే.. భారీ బడ్జెట్, సెట్స్‌తో విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తారు అనే టాక్ ఉంది. అర్జున్ సినిమాలో ఆయన వేసిన గుడి సెట్టింగ్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా గుణశేఖర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమార్తె.. నీలిమా గుణ వివాహం జరిగింది. రామకృష్ణ పింజల, సత్య దంపతుల కుమారుడు రవి ప్రఖ్యాతో.. నీలిమా గుణ వివాహం జరిగింది.
ఇక తాజాగా నీలిమా గుణ-రవి ప్రఖ్యాల వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరై నీలిమ-రవి దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఓ అరుదైన దృశ్యం చోటు సుకుంది. అదేంటంటే.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. అభిమానులకు ఐఫీస్ట్ కలిగించారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే వేదిక మీద చూడటంతో.. ఇటు అల్లు ఫ్యాన్స్.. అటు మహేష్ బాబు అభిమానులు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి ఫోటోను చూసిన నెటిజనులు.. వాటే కాంబినేషన్.. ఫోటో ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వేడుకకు.. రాజశేఖర్ దంపతులు, దర్శకుడు రాజమౌళి దంపతులు, కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నీలిమా గుణ తండ్రి గుణ శేఖర్ తెరక్కిస్తోన్న శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసుత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దుష్యంతుడు, శకుంతల మధ్య నడిచిన ప్రేమ గాథ. ఈ పౌరాణిక గాథను గుణ శేఖర్ అందమైన.. విజువల్ ఫీస్ట్‌గా ఉండే లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత శకుంతలగా నటిస్తుంటే.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.