తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ప్రముఖ దర్శకులు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. పుష్ప మానియా ప్రపంచ స్థాయికి వెళ్లింది. సోషల్ మీడియాలో చాలా తక్కువమంది స్టార్ల ఫ్యామిలీలు యాక్టివ్‌గా ఉంటాయి. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఒకరు. ఇక కెరీర్ పరంగా అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏ మాత్రం విరామం దొరికినా కుటుంబంతో విదేశాలకు వెళ్తుంటారు.
ఇక ఆయన కూతురు అర్హ అంటే అల్లు అర్జున్ కి వల్లమాలిన అభిమానం. అల్లు అర్జున్ సతీమణి కూడా అల్లు అర్హ, అయాన్ లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే పుష్ప పార్ట్ 1 సక్సెస్ అవ్వడంతో వెంటనే పుష్ప పార్ట్ 2 పనులను మొదలుపెట్టేసింది మూవీ టీమ్. ఇందు కోసం అల్లు అర్జున్ దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా అల్లు అర్హ తన తండ్రికి ఓ లవ్లీ వెల్కమ్ చెప్పింది. దాదాపు 16 రోజుల తర్వాత రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బన్నీకి ఆర్ష స్వీట్ వెల్కమ్ చెప్పింది.
ఆకులు గులాబీ పూల రెక్కలతో `వెల్కమ్ నాన్న` అని రాసి బన్నీకి ఇంట్లోకి వెల్కమ్ చెప్పింది అర్హ. బన్నీ ఈ ఫొటోని సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకి `పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తాను దుబాయ్ లో పొందిన ఆనందం కంటే మించిన ఆనందం తన కూతురు ద్వారా లభించినట్టు అనుభూతి చెందాడు. గతంలోనూ అల్లు అర్జున్, అర్హా అల్లరి చేస్తూ.. కబుర్లు చెప్పుకుంటూ.. గేమ్స్ ఆడుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు బన్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.