బన్నీ కూతురు టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయింది. 'శాకుంతలం' రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. ఈ మూవీలో అల్లు అర్హ యాక్టింగ్ తో క్యూట్ గా ఆకట్టుకుంది. చెప్పాలంటే ఓ విషయంలో హైలెట్ గా నిలిచింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పగానే.. ఇండియావైడ్ అందరికీ గుర్తొచ్చే మూవీ ‘పుష్ప’. ఈ ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన బన్నీ.. తన తర్వాత జనరేషన్ ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేశాడు. ఇతడి కూతూరు అర్హ.. ‘శాకుంతలం’ సినిమాలో నటించిందని చాలామందికి తెలుసు. అయితే చిన్న పిల్ల కదా! ఎలా చేసుంటుంది? తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిందా? లేదా? అని బన్నీ, మెగా ఫ్యాన్స్ కి ఇలా చాలానే సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటికీ అర్హ.. తన క్యూట్ యాక్టింగ్ తో ఆన్సర్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Allu Arha, Shaakuntalam
అసలు విషయానికొస్తే.. తెలుగులో చాలామంది హీరోలున్నారు. వాళ్ల వారసుల్లో చాలామంది ఇప్పటికే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ కూడా చేరింది. ‘శాకుంతలం’లో భరత అనే అబ్బాయి క్యారెక్టర్ చేసింది. చాలా క్యూట్ గా కనిపించి ఎంటర్ టైన్ చేసింది. సినిమాలో అర్హ యాక్ట్ చేయడం గొప్ప విషయం కాదు. తెలుగులో చాలా లెంగ్త్ ఉన్న డైలాగ్స్ ని అంతే క్యూట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి మరీ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇదే అటు బన్నీ ఫ్యామిలీలో ఆనందానికి కారణమైంది. ఇండస్ట్రీలో అర్హ యాక్టింగ్ హాట్ టాపిక్ గా మారిపోయింది.
మహాభారతంలో ఓ ప్రేమకథ ఆధారంగా సమంత ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో శకుంతల కొడుకు భరతుడి పాత్రలో అర్హ యాక్ట్ చేసింది. మూవీ క్లైమాక్స్ లో ఈమె ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ షాట్ లోనే సింహంతో కనిపిస్తుంది. ఆ తర్వాత దుష్యంతుడితో గొడవపడే సీన్ లో తెలుగు డైలాగ్స్ చాలా చక్కగా చెప్పింది. ఎంత ప్రాక్టీసు చేయించారో ఏమో గానీ ఇప్పటి పిల్లలతో పోలిస్తే.. తెలుగు మాట్లాడే విషయంలో సూపర్ అనిపించింది. కూతురు యాక్టింగ్ చూసి బన్నీ కూడా మురిసిపోతున్నాడు. అందుకేనేమో ‘శాకుంతలం’ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మరి కూతురిని ఫుల్ టైమ్ యాక్టర్ గా కంటిన్యూ చేయిస్తాడా? లేదా ఈ ఒక్క మూవీతోనే సరిపెట్టేస్తాడా అనేది చూడాలి. అర్హని చూస్తుంటే భవిష్యత్ లో బన్నీకి తగ్గ తనయ అవుతుందనిపిస్తుంది. మీలో ఎవరైనా ‘శాకుంతలం’ చూస్తే.. అర్హ యాక్టింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
#AlluArha
Mark my words… ✅She'll RULE TELUGU INDUSTRY … 🔥🔥
She's Icon Star Allu Arjun's Daughter…❤️
Note her name: ALLU ARHA♥️#AlluArjun𓃵 @alluarjun @Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Shaakuntalam @Gunasekhar1 #GunaSekhar pic.twitter.com/aQpCkTyBmC
— Bunny Mailapalli (@BunnyMailapalli) April 14, 2023