ఎంత చైన్ స్మోకర్ అయినా రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగుతాడేమో. కానీ అల్లరి నరేష్ ఏకంగా రోజుకు 150, 200 సిగరెట్లు తాగారట. చైన్ స్మోకర్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారుగా. కానీ అలా ఎందుకు తాగాల్సి వచ్చిందో అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒక మనిషి రోజుకు గట్టిగా 20 సిగరెట్లు తాగుతారేమో.. లేదంటే 30 సిగరెట్లు స్మోక్ చేస్తారేమో. కానీ అల్లరి నరేష్ ఏకంగా నాలుగు రోజుల్లో 500 నుంచి 600 సిగరెట్లు తాగేశారట. 17 ఏళ్ల నుంచి 71 ఏళ్ల మధ్యలో ఒక మనిషి తన జీవిత కాలంలో ఏడాదికి 5,772 సిగరెట్లు చొప్పున 3,11,688 సిగరెట్లు తాగుతాడని ఒక స్టడీ తెలిపింది. అంటే రోజుకు 15 సిగరెట్లు అన్న మాట. ఈ లెక్కన నాలుగు రోజులకు 60 సిగరెట్లు. కానీ అల్లరి నరేష్ ఏకంగా 600 సిగరెట్లు తాగారట. అంటే రోజుకు 150 సిగరెట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? అల్లరి నరేష్ మరీ ఇంత చైన్ స్మోకరా? అని అనిపిస్తుంది కదూ. కానీ అల్లరి నరేష్ ఈ సిగరెట్లు తాగింది తన కోసం కాదట. మరి ఎవరి కోసం?
కామెడీ హీరోగా అలరించిన అల్లరి నరేష్.. మెల్లగా యాక్షన్ హీరోగా తనను తాను మలచుకుంటున్నారు. మహర్షి సినిమాలో సీరియస్ రోల్ లో నటించి ట్రైలర్ చూపించిన అల్లరి నరేష్.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో ఫుల్ మూవీ చూపించారు. కామెడీ పండించడంలోనే కాదు, అన్ని రకాల ఎమోషన్స్ పండించడంలోనూ తాను సమర్థుడని మరోసారి నిరూపించుకున్నారు. నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరోసారి కలిసి చేసిన సినిమా ఉగ్రం. ఈ సినిమా మే 5న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూవీ షూటింగ్ లో భాగంగా సిగరెట్లు తాగాల్సి వచ్చిందట. అడవిలో ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఒకవైపు దట్టంగా పొగ రావడం కోసం మెషీన్లు పెట్టారు. మరోవైపు సిగరెట్ తాగుతూ రావాలని చెప్పేవారని.. కంటిన్యుటీ షాట్ కోసం సిగరెట్లు తాగుతూ ఉన్నానని అల్లరి నరేష్ అన్నారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారు వందల సిగరెట్లు తాగానని, దీని వల్ల దగ్గు, జ్వరంతో ఆరోగ్యం దెబ్బతిందని అన్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా షూటింగ్ కోసం హీరోలు అంకితభావంతో పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ ఇలా నాలుగు రోజుల్లో ఐదారువందల సిగరెట్లు కాల్చి పడేశారు. సినిమా కోసం మరీ ఇంతలా ఉంటారా? మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.