అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తను చనిపోతే తప్ప అది జరగని పని అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ ఏం జరిగింది?
అల్లరి నరేష్.. టాలీవుడ్ లో ఈ పేరుకు స్పెషల్ క్రేజ్ ఉంది. కామెడీ సినిమాలతో హీరోగా విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతడు.. ఆ తర్వాత నటుడిగా ఫేడ్ ఔట్ అయిపోయే దశకు చేరుకున్నాడు. అలాంటి నరేష్ కి ‘నాంది’ రూపంలో అద్భుతమైన కమ్ బ్యాక్ లభించింది. ఇప్పుడు ఆ మూవీ డైరెక్టర్ తో చేసిన మూవీ ‘ఉగ్రం’. మే 5న థియేటర్లలోకి రానున్న సందర్భంగా ప్రమోషన్స్ తెగ స్పీడ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా అల్లరి నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
అసలు విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు నరేష్. ‘అల్లరి’ మూవీతో హిట్ కొట్టి, దాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత కామెడీ సినిమాలు వరసపెట్టి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. కానీ 2012లో ‘సుడిగాడు’తో హిట్ కొట్టాడు. అప్పటినుంచి దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్కదానితోనూ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో నరేష్ కెరీర్ అయిపోయిందని విమర్శలు చాలా వినిపించాయి.
తాజాగా ‘ఉగ్రం’ ప్రమోషన్ లో అల్లరి నరేష్ కి సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి సమధానమిచ్చిన నరేష్.. ’60 సినిమాలు చేశాను, 60 శుక్రవారాలు చూశాను, హీరోగా నా కెరీర్ గురించి చాలామంది చాలా మాటలు అన్నారు. అదంతా పక్కనబెడితే నేను చనిపోతేనే నా కెరీర్ అయిపోయినట్లు. అప్పటివరకు నేను సినిమాలు చేస్తుంటాను.’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా మహర్షిలో సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకున్న నరేష్.. నాగార్జున కొత్త మూవీలో విలన్ గా చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది. తాజాగా నరేష్ వ్యాఖ్యలు వింటుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.