అల్లరి నరేష్ కూతురు తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో. అల్లరి నరేష్ తో కలిసి సినిమా కూడా చేసింది. సినిమా చూడండి, బాగా నటించాను అని ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. పెద్దయ్యాక సమంత అవుతాదట. అంటే సమంతలా పెద్ద నటి అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయిపోయింది.
కామెడీతో కితకితలు పెట్టడమే కాదు, సీరియస్ పాత్రల్లో నటించి ఏడిపించడంలోనూ అల్లరి నరేష్ దిట్ట. అల్లరి, తొట్టిగ్యాంగ్, కితకితలు వంటి హాస్యభరిత చిత్రాలతో నవ్వించిన అల్లరి నరేష్.. ప్రాణం, నేను, గమ్యం వంటి సినిమాల్లో సీరియస్ రోల్స్ లో నటించి సత్తా చాటారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా కన్నీళ్లు పెట్టించేశారు. ఆ తర్వాత నాంది సినిమాతో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా నటిస్తారని ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా నుంచి అల్లరి నరేష్ సీరియస్ కథలపైనే దృష్టి పెట్టారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో హిట్ కొట్టిన.. అల్లరి నరేష్ ఇప్పుడు ఉగ్రం సినిమాతో మన ముందుకు వస్తున్నారు.
ఉగ్రం ట్రైలర్ చూస్తుంటే పాత అల్లరి నరేష్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. కామెడీ హీరో ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడాలని అల్లరి నరేష్ భావిస్తున్నట్లు ఈ సినిమాతో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సినిమా మే 5న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో నటించారు. నాంది సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల మరోసారి అల్లరి నరేష్ తో కలిసి ఈ ఉగ్రం సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూతురు నటించడం విశేషం. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ కూతురు ముద్దు ముద్దు మాటలతో ఎంతగానో ఆకట్టుకుంది.
తాను ఈ సినిమాలో బాగా నటించానని, అందరూ ఖచ్చితంగా చూడండని, ఈ సినిమా చాలా బాగుందని క్యూట్ గా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో.. మాట్లాడుతుంటే ముద్దొచ్చేస్తోంది. ఒక పాట కూడా పాడింది. రెండవ తరగతి అయిపోయిందని, మూడవ తరగతిలోకి వచ్చానని ఎంత క్యూట్ గా మాట్లాడిందో. ఇక పెద్దయ్యాక ఏమవుతావని అంటే సమంత అవుతానంటూ జవాబిచ్చింది. సమంతలా పెద్ద నటి అవ్వాలని చిన్న వయసులోనే ఒక గోల్ సెట్ చేసేసుకుంది. అల్లరి నరేష్ కుటుంబం నుంచి హీరోయిన్ వచ్చేస్తుందన్నమాట అయితే. మరి అల్లరి నరేష్ కూతురు బుజ్జి బుజ్జి మాటలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.