హీరోలు, దర్శకులకి మధ్య బాండింగ్ కుదిరితే వారి కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటుంటారు ఫ్యాన్స్. ఇద్దరి మధ్య ర్యాపో సెట్ అయితే.. హీరో, డైరెక్టర్ కూడా కలిసి సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతారు. ఇప్పుడిదే వరుసలో కొత్త కాంబో చేరనుంది.
ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులకి మధ్య బాండింగ్ కుదిరితే వారి కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటుంటారు ఫ్యాన్స్. అలాగే ఇద్దరి మధ్య ర్యాపో సెట్ అయితే.. హీరో, డైరెక్టర్ కూడా కలిసి సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతారు. ఇప్పటిదాకా మొదటి సినిమాతోనే హిట్టు కొట్టేసి, ఆ తర్వాత పదేపదే ఒకే హీరో, దర్శకులు కలిసి చేసిన సినిమాలు రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అలా తెలుగులో త్రివిక్రమ్ – బన్నీ, త్రివిక్రమ్ – మహేశ్ బాబు, పూరి – రవితేజ, సుకుమార్ – బన్నీ, రాజమౌళి – ఎన్టీఆర్, రాజమౌళి – ప్రభాస్.. ఇలా కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ చూశాం. ఇప్పుడిదే వరుసలో హీరో అల్లరి నరేష్ – దర్శకుడు విజయ్ కనకమేడల కాంబో చేరనుంది.
2021లో అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ చేశాడు విజయ్. మొదటి మూవీనే సూపర్ సక్సెస్ అయ్యేసరికి.. అదే నరేష్ తో విజయ్.. ‘ఉగ్రం’ అనే సినిమా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు. సరే.. కాంబినేషన్, బాండింగ్ కుదరడంతో రెండో సినిమా చేస్తున్నారని అంతా అనుకున్నారు. నాంది తర్వాత ఉగ్రం అనే టైటిల్ కూడా అందరినీ ఇంప్రెస్ చేసింది. దీంతో ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో హిట్ కాబోతుందని అనుకున్నారు. తాజాగా ఉగ్రం నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్లుగానే టీజర్ తోనే మరో సాలిడ్ హిట్ కొట్టబోతున్నారని అంచనాలు క్రియేట్ చేశారు.
ఉగ్రంలో అల్లరి నరేష్.. మంచి ఎమోషన్స్ తో కూడిన పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా టీజర్ ని అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు. ఈ క్రమంలో అల్లరి నరేష్.. ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఏకంగా దర్శకుడు విజయ్ తో నాంది, ఉగ్రంల తర్వాత త్వరలోనే మూడో సినిమా అనౌన్స్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఏంటి.. ఒకే దర్శకుడితో గ్యాప్ లేకుండా మూడు సినిమాలా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. కానీ.. ఉగ్రం మూవీపై నరేష్ ఇంకా మూవీ టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఇన్నాళ్లు కామెడీ రోల్స్ చేసిన నరేశ్.. ఇప్పుడిప్పుడే హీరోగా సీరియస్ రోల్స్ తో పాటు సబ్జెక్టు ఉన్న కథలు ఎంచుకుంటున్నాడు. మరి ఉగ్రం సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.